For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జీ సినీ అవార్డుల పంక్షన్- రెచ్చిపోయిన భామలు(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: జీ సినీ అవార్డులు 2013 పంక్షన్ ఘనంగా బాలీవుడ్ ఎప్పటిలాగే జరుకుంది. బాలీవుడ్ ప్రతీ సంవత్సరం అత్యుత్సాహంతో జరుపుకునే సినీ పంక్షన్ లో ఇది ఒకటి. ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో ఈ ఈవింట్ చోటు చేసుకుంది. అందులోనూ 2013లో మొదటి బాలీవుడ్ జరుపుకునే పంక్షన్ ఇదే కావటంతో సెలబ్రెటీలంతా అమితమైన ఉత్సాహంతో పాల్గొన్నారు.

  ఇక ఈ సంవత్సరం జీ సిని ఆవార్డులు వచ్చిన చిత్రాలు ఏమిటంటే...

  బెస్ట్ ఫిల్మ్ 'బర్ఫీ!'
  బెస్ట్ పాపులర్ ఏక్టర్ (మేల్)రణబీర్ కపూర్ 'బర్ఫీ!'
  బెస్ట్ పాపులర్ ఏక్టర్ (ఫిమేల్) ప్రియాంక చోప్రా 'బర్ఫీ!'
  బెస్ట్ ఏక్ట్రస్ (క్రిటిక్స్) శ్రీదేవి..'ఇంగ్లీష్ వింగ్లీష్ '
  బెస్ట్ ఏక్టర్ (క్రిటిక్స్)... హృతిక్ రోషన్ ...'అగ్నిపథ్'
  బెస్ట్ డెబ్యూ (మేల్)అర్జున్ కపూర్... ఇష్క్ జాదే, ఆయూష్ ఖురానా..విక్కీ డోనర్
  బెస్ట్ స్టోరీ.. సంజయ్ ఘోష్... 'కహానీ'
  బెస్ట్ కొరియోగ్రాఫర్... గణేష్ ఆచార్య..'చికినీ చమేలీ'
  బెస్ట్ డెబ్యూ డైరక్టర్.. గౌరీ షిండే... 'ఇంగ్లీష్ వింగ్లీష్ '
  బెస్ట్ నెగిటివ్ రోల్ యాక్టర్ రిషి కపూర్ ..'అగ్నిపథ్'
  బెస్ట్ మ్యూజిక్ ప్రీతమ్ కాక్ టైల్
  బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్... అజయ్ అతుల్ 'అగ్నిపథ్'

  ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డ్ (మేల్).. షారూఖ్ ఖాన్
  ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డ్ (ఫిమేల్) కత్రినా కైఫ్

  సాంగ్ ఆఫ్ ది ఇయిర్ 2012 రాధా పాట.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయిర్'

  ఇక ఈ పంక్షన్ కి హాజరైన సెలబ్రేటీలను ఒకసారి పరికిస్తే..

  దీపికా పదుకోని... 2012లో కేవలం కాక్ టైల్ చిత్రంలో మాత్రమే కనిపించిన ఈ ముద్దుగుమ్మ పంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించింది.

  మలైకా అరోరా... బాలీవుడ్ నే మాత్రమే కాక గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అనిపించిన ఈమె... తన భర్తతో కలిసి ఈ పంక్షన్ లో సందడి చేసింది.

  జెనీలియాకు 2012 సినిమాల పరంగా ఏమీ కలిసి రాలేదు. కాని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైంది.

  బర్పీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అందరి దృష్టిలో పడటానికే అన్నట్లు ప్రత్యేకంగా తయారై వచ్చింది.

  ఈషా గుప్త... రాజ్ 3డి, జన్నత్ 2 రెండు చిత్రాలలో హాట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ... 2013 తనదే అన్నంత థీమాగా ఉంది.

  రక్త చరిత్రతో తెలుగు వారికి సైతం పరిచయమైన వివేక్ ఒబరాయ్ కెరీర్ లో స్పీడు ఏ మాత్రం లేదు. తన భార్యని తీసుకుని ఈ పంక్షన్ కి వచ్చాడు.

  భర్తతో కలిసి వచ్చిన శ్రీదేవి... ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంకు అవార్డులు రావటంతో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది.

  విద్యాబాలన్ కి డర్టీ పిక్చర్, కహానీలతో హీరో లేకపోయినా వంద కోట్లు తను తెప్పించగలనని ప్రూవ్ చేసింది. రీసెంట్ గా పెళ్లిచేసుకుని భర్తతో ఉషారుగా ఈ పంక్షన్ కి వచ్చింది.

  తెలుగులోనూ ఇంద్ర, మురారి వంటి చిత్రాలతో అదరకొట్టిన సోనాలి బింద్రే మళ్లీ రీఎంట్రీకి దర్శక,నిర్మాతలను కలుస్తున్నట్లు వినకిడి. ఈ పంక్షన్ లోనూ అదే పని మీద ఉందని బాలీవుడ్ అంటోంది.

  యామీ గౌతమ్... తెలుగులో రవిబాబు.. నువ్విలా చిత్రంతో అదరకొట్టిన ఈమె అల్లు శిరీష్ సరసన గౌరవంలో చేస్తోంది.. బాలీవుడ్ లోనూ ఒకటి రెండు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.

  బాలీవుడ్ హాట్ సెలబ్రేటీలలో ప్రభుదేవా ఒకరు. తెలుగు, తమిళ రీమేక్ లతో అక్కడ దుమ్ము రేపుతున్న ఆయన.. ఇప్పుడు బాలీవుడ్ లో భాగం అయ్యారు. మాస్ మసాలా సినిమాకు కేరాఫ్ ఎడ్రస్ అయ్యారు

  తెలుగు సంతోషం సినిమాలో నాగ్ ప్రక్కన చేసిన గ్రేసీ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు కోసం వెతుక్కుంటోంది. అయితే ఆమె గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు అంటున్నారు కానీ ఆఫర్స్ ఇవ్వటంలోనే వెనకంజ వేస్తున్నారు.

  ఆరెంజ్ లో రామ్ చరణ్ ప్రక్కన అదరకొట్టిన ఈమె.. బాలీవుడ్ లో హౌస్ ఫుల్ వంటి చిత్రాల్లో చేస్తోంది కానీ బ్రేక్ అయితే రాలేదు.. ఇలాంటి పంక్షన్ లతో నలుగురు కళ్ళలో పడి మంచి ఆఫర్స్ సంపాదించకపోతానా అని ప్రయత్నిస్తోంది.

  English summary
  The ZEE Cine Awards 2013 ceremony was one of the first Bollywood award shows to take place this year. The event was held at the Yash Raj Studios in Mumbai. It was hosted by Abhishek Bachchan and Ritiesh Deshmukh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X