BRO: ఫేమస్ ఛానెల్‌కు బ్రో హక్కులు.. పవన్ కెరీర్‌లోనే బిగ్ డీల్
గతంలో కంటే ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలో టాలీవుడ్‌లో ఎక్కువగా వస్తున్నాయి. వీటికి వాళ్ల వాళ్ల అభిమానులతో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఫలితంగా ఈ తరహా సినిమాలు మంచి విజయాలను అందుకుంటోన్నాయి. దీంతో టాలీవుడ్‌లోని హీరోలు మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో (BRO)' అనే మూవీ చేస్తోన్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
దేవుడు, భక్తుడు కాన్సెప్టుతో రూపొందిన తమిళ చిత్రం 'వినోదయ సీతమ్'కు 'బ్రో (BRO)' రీమేక్‌గా తెరకెక్కతోంది. దీనికి ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. ఆ వెంటనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన చాలా వరకు షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఇక, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌పై ఫేమస్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ కూడా భాగం అయ్యారు.

మెగా హీరోల కాంబోలో వస్తున్న 'బ్రో (BRO)' మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలు పెరిగిపోయాయి. దీంతో దీనికి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌కు అప్పుడే భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హక్కులను జీ తెలుగు సంస్థ సొంతం చేసుకుందట. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఆ ఛానెల్ భారీ ధరకు కొనుగోలు చేసిన అతి తక్కువ చిత్రాల్లో 'బ్రో (BRO)' ఒకటిగా నిలిచిందని అంటున్నారు. దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న 'బ్రో (BRO)' చిత్రంలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











