Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
జానీ మాస్టర్ డేరింగ్ స్టెప్.. మొత్తానికి అలా మారిపోయాడు.. డబ్బుల కోసమే అలా చేశాడా?
దసరా పండుగకు బుల్లితెరపై ఓ కోల్డ్ వార్ జరుగుతోందన్న సంగతి అందరికీ తెలిసింది. అందరూ స్పెషల్ ఈవెంట్లతో ప్రేక్షకులపై దాడి చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ప్రోమోలతో ఒక్కొక్కరు విరుచుకుపడుతున్నారు. ఎవరి ఈవెంట్లలో ఏమేం ఉండబోతోన్నాయో చెప్పేశారు. ప్రోమోలతో తమ తమ ఈవెంట్లపై హైప్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఇంకా కొందరు ప్రోమోలు వేస్తూనే ఉన్నారు. ఇందులో జీ తెలుగు దసరా ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

బుల్లితెర పోరు..
మాములుగా ఏదైనా పండుగ వస్తే బుల్లితెరపై ప్రత్యేక ఈవెంట్లు సందడి చేస్తుంటాయి. ఈ సారి ఆ పోరు మరింత కఠినంగా ఉండోబోతోంది. ఒక్కొక్కరు తమ దైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈటీవీలో సంగీత, నవదీప్, శేఖర్ మాస్టర్ రచ్చ చేస్తుంటే.. స్టార్ మాలో వంటలక్క, డాక్టర్ బాబు, బాబా మాస్టర్ దుమ్ములేపేందుకు సిద్దమయ్యారు.

జీ తెలుగులో..
దసరాకు జీ తెలుగులో ప్రదీప్ శ్రీముఖి పెళ్లి కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చారు. చిరంజీవి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది అంటూ ఏదేదో చేస్తున్నారు. ఇందులో మొత్తానికి శ్రీముఖి ప్రదీప్ మధ్య ఏదో ఉందనేది క్రియేట్ చేయాలని భావిస్తున్నట్టున్నారు.

నాగబాబు, నిహారికలు..
ఇక ఈ ఈవెంట్‌లో నాగబాబు, నిహారికలు ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలు అందులో నిహారిక చేసిన అల్లరి, పంచ్‌లు బాగానే పేలాయి. ఇక నిహారిక, ప్రదీప్ కలిస్తే అక్కడ సెటైర్లు ఎలా పడతాయో అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఒకెత్తు అయితే జానీ మాస్టర్ మాత్రం అందరికీ ఓ షాక్ ఇచ్చాడు.

జానీ మాస్టర్ గెటప్ వైరల్..
జానీ మాస్టర్ లేడీ గెటప్‌లో దర్శనమిచ్చి ఓ పర్ఫామెన్స్ చేశాడు. జానీ మాస్టర్ లేడీ గెటప్ కోసం కష్టపడిన తీరు, ఆడవాళ్లకు ఉండే కష్టాలను చెప్పి అందర్నీ టచ్ చేసేశాడు. అయితే జానీ మాస్టర్ ఎమోషనల్‌గా చెప్పినా కూడా ఈవెంట్ కోసం భారీగా చెల్లించి ఉంటారు అందుకే లేడీ గెటప్ వేసుకున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే ఈవెంట్‌లో కల్నల్ సంతోష్ బాబుకు నివాళిగా ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్ కూడా చేశారు.