సెంటిమెంట్‌తో కొట్టేశారు.. కల్నల్ సంతోషబాబుకు నివాళి.. అనసూయ కన్నీరు
బుల్లితెరపై దసరా పండుగ పదింతల సంబరాన్ని తీసుకొచ్చేలా ఉంది. ఒకరిని మించి ఒకరు ఈవెంట్లను ప్లాన్ చేశారు. ఎవరికి వారు తమదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రతీసారి నవ్వించడం కామన్ అయిపోతుందని భావించారో ఏమో గానీ ఈ సారి కాస్త ట్రాక్ మార్చారు. ఎంతగా నవ్విస్తారో అంతగా ఏడిపించేలానే ఉన్నారు. అక్కా ఎవరే అతగాడు ఈవెంట్‌లో ఒకలా ఎమోషనల్‌గా టచ్ చేశారు. తాజాగా ప్రదీప్ శ్రీముఖిపై జీ తెలుగులో చేస్తోన్న ఈవెంట్‌లో దేశ భక్తిని చాటేలా సందేశాన్ని ఇచ్చారు.

పోటాపోటీగా ఈవెంట్లు..
దసరా పండుగకు సంక్రాంతి పందెం కోళ్లలా టీవీ చానెళ్లు పోటీపడుతున్నాయి. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా వినోదాన్ని పంచే చానెళ్లు స్పెషల్ ఈవెంట్లతో రెడీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలన్నీ తెగ వైరల్ అవుతున్నాయి. అక్కా ఎవరే అతగాడు, స్టార్ మా జాతరో జాతర, జీ తెలుగు ప్రదీప్ శ్రీముఖి ఈవెంట్లు బాగానే క్లిక్ అయ్యాయి.

అక్కడ అలా..
అక్క ఎవరే అతగాడు ఈవెంట్‌లో ఫన్ ఎంతగా ఉండబోతోందో.. అంతే ఎమోషనల్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. దివంగతులైన హాస్య నటులను గుర్తు చేస్తూ ఓ స్కిట్ చేశారు. ఏవీఎస్, కొండవలస, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్, జయప్రకాష్ రెడ్డి ఇలా కమెడియన్ల డూపులను పట్టుకొచ్చారు. అంతేకాకుండా కమెడియన్ల ఫ్యామిలీలను కూడా తెరపైకి తీసుకొచ్చారు. అలా అది బాగానే పండింది.

ప్రదీప్ శ్రీముఖి ఈవెంట్..
చిరంజీవి ప్రదీప్, చిలసౌ శ్రీముఖి అంటూ జనాలను పిచ్చోళ్లను చేసేందుకు ఓ ఈవెంట్ చేస్తున్నారు. ప్రదీప్ శ్రీముఖికి పెళ్లి అంటూ ఓ శుభలేఖ చుట్టూ ఈవెంట్‌ను తిప్పేలా కనిపిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో నాగాబాబు, నిహారిక, అనసూయ సందడి చేయనున్నారు.

కామెడీ స్కిట్స్..
ప్రదీప్ శ్రీముఖి చుట్టే తిరిగే ఈ ఈవెంట్లు కామెడీ స్కిట్స్, నిహారిక పంచులు, అనసూయ సెటైర్లు, డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు ఇలా బోలెడన్ని ఉన్నాయని కనిపిస్తోంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేశారు.
Recommended Video

కల్నల్ సంతోష్ బాబు..
గాల్వన్ లోయలో చైనా సైనికులతో పోరాడి వీరస్వర్గం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు నివాళి అర్పించారు. దేశం కోసం కనీసం పబ్జీ యాప్‌ను డిలీట్ చేయని యువత, యువత మారితేనే దేశం బాగుపడుతుందంటూ దేశభక్తిని చాటేలా ఓ పర్ఫామెన్స్ చేశారు. ఈ పర్ఫామెన్స్‌ను చూసి, కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ అనసూయ కన్నీరు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











