Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీముఖి అలా టార్చర్ పెడుతుందట.. ఆ దెబ్బకు అమ్మ బాబోయ్ అంటోన్న విష్ణు ప్రియ
శ్రీముఖి విష్ణుప్రియ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో వీరిద్దరూకలిసి చేసే సందడికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. వీకెండ్ పార్టీల్లో కలిసి చేసే సందడికి నెటిజన్లు షాక్ అవుతుంటారు. ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఏదైనా షోలో గెస్ట్‌గా పిలిచినా కూడా ఈ ఇద్దరిని జంటగా పిలుస్తుంటారు. అలా వీరి స్నేహం బుల్లితెరపై అందరికీ తెలిసిందే. క్యాష్, వావ్ వంటి షోల్లో వీరు చేసిన సందడి అందరికీ తెలిసిందే.
తాజాగా ఈవెంట్లోనూ..
శ్రీముఖి ప్రస్తుతం బొమ్మ అదిరింది షోలో సందడి చేస్తోంది. యాంకర్‌గా శ్రీముఖి అదరగొడుతోంది. ఫన్ కూడా బాగానే క్రియేట్ అవుతోంది. ఇక దసరా ఈవెంట్ అయితే ఏకంగా శ్రీముఖి మీదే ప్లాన్ చేసేశారు. చిరంజీవి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి అంటూ ఓ స్పెషల్ ఈవెంట్‌ను రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు తెగ వైరల్ అవుతున్నాయి.
నర్సపెల్లి అనే పాటకు..
యూట్యూబ్ సెన్సేషన్ కనకవ్వ పాడిన నర్సపెల్లి అనే పాట గురించి అందరికీ తెలిసిందే. అదే పాటను ఈ మధ్య మంగ్లీ, కనకవ్వ కలిసి పాడారు. అది తెగ వైరల్ అయింది. ఈ దసరా ఈవెంట్లోనూ అదే పాటకు విష్ణు ప్రియ, భాను శ్రీలు కలిసి అదరగొట్టేశారు. దాని గురించి చెబుతూ విష్ణుప్రియ తాజాగా ఓ పోస్ట్ చేసింది.
మరిచిపోతుంటాను..
స్టేజ్ మీద డ్యాన్స్ చేయడమంటే నాకు బోర్డ్ ఎగ్జామ్ రాసినట్టు అనిపిస్తుంది.. మనం కచ్చితంగా పాస్ అవ్వాలి.. కానీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వాలి.. అందుకే నేను ఆ ఒత్తిడిని తీసుకోవడం మానేశాను. కొన్ని సార్లు.. కొన్ని సార్లు ఏంటి చాలా సార్లు రెండు మూడు స్టెప్స్ మరిచిపోతుంటాను. కానీ నా ఫ్రెండ్ శ్రీముఖి ఉంది కదా అది నన్ను నైస్‌గా ఎగ్జామ్ పాస్ అయ్యేలా చేస్తుంది. శ్రీముఖి ప్రతీ మూమెంట్‌ను గుర్తు పెట్టుకోవాలని ఫోర్స్ చేస్తుందని విష్ణుప్రియ శ్రీముఖి గురించి చెప్పింది.
Recommended Video
మొత్తానికి అయిపోయింది..
దానివల్ల మరింత ఒత్తిడి పెరిగింది. అది మీకు కనిపిస్తూనే ఉంటుంది. దానికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. అమ్మ బాబోయ్.. పర్ఫామెన్స్ అయిన అర్ధగంటకు కూడా వేరే లోకంలో ఉండిపోయాను.. అదేంత ఫన్నీగా ఉందో అని ఆలోచించాను. ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి. కానీ ఆ ఇద్దరు సీతాకోకచిలుకల వల్ల ఎంతో ఎంజాయ్ చేశాను. ప్రతీసారి ఏదో కొత్త ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుందని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.