twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్.. యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. శుభలేఖ కూడా రెడీ!!

    |

    బుల్లితెరపై ఎంతకీ చిక్కటి బేతాళ ప్రశ్నల మిగిలిపోయింది యాంకర్ ప్రదీప్ పెళ్లి. అయితే ఈ కోవలో సుధీర్, హైపర్ ఆది వంటి వారున్నా కూడా అందరూ ప్రదీప్ పెళ్లి గురించే మాట్లాడుకుంటారు. బుల్లితెర మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ గ్రూపుకు అడ్మిన్‌లా ప్రదీప్‌ను ఏడిపిస్తుంటారు. యాంకర్ ప్రదీప్ పెళ్లి వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. రెండు మూడు వారాల క్రితమే యాంకర్ పెళ్ళి అంటూ ఓ రేంజ్‌లో రచ్చ అయింది. అయితే తాజాగా అందరికీ ఓ సర్ ప్రైజ్ వచ్చింది.

    స్పెషల్ ఈవెంట్స్..

    స్పెషల్ ఈవెంట్స్..

    ముఖ్యమైన పండుగలకు మన బుల్లితెర ఎంత కలర్ ఫుల్‌గా మారుతుందో అందరికీ తెలిసిందే. దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ బుల్లితెర తారలంతా ఒక్క చోటకు చేరుతారు. ఈటీవీలో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లది పైచేయి. స్టార్ మాలో సీరియల్ ఆర్టిస్ట్‌లది పైచేయి. జీతెలుగు కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.

    జీ తెలుగు స్పెషల్ ఈవెంట్..

    జీ తెలుగు స్పెషల్ ఈవెంట్..

    జీ తెలుగు కూడా స్పెషల్ ఈవెంట్లలతో సత్తా చాటుతోంది. ఆ మధ్య వినాయక చవితికి నిహారికను పట్టుకొచ్చి అదిరిపోయే ఈవెంట్ చేశారు. బాపు బొమ్మకు పెళ్లంట అంటూ నిహారికను మెయిన్ లీడ్‌గా పెట్టి ఈవెంట్‌ను కానిచ్చారు. ఈ దసరాకు మరో కొత్త ప్లాన్ వేశారు. ఈ సారి వాడిన అస్త్రం పేరు యాంకర్ ప్రదీప్.

     ప్రదీప్ పెళ్లిపై..

    ప్రదీప్ పెళ్లిపై..

    మామూలుగా ఈవెంట్ ఏదైనా సరే యాంకర్ మాత్రం ప్రదీపే. ఎన్నో ఈవెంట్లను తన యాంకరింగ్‌తో గట్టెక్కించాడు. అయితే ఈ సారి మాత్రం ప్రదీప్ యాంకర్ పాత్ర పోషించడం లేదు. అతడినే పెట్టి కొత్త కథ అల్లారు. ఎప్పటి నుంచి నాన్చుతూ వస్తోన్న యాంకర్ ప్రదీప్ పెళ్లినే ఈవెంట్‌గా చేసేందుకు ఫిక్స్ అయ్యారు.

     శ్రీముఖి-ప్రదీప్ పెళ్లి..

    శ్రీముఖి-ప్రదీప్ పెళ్లి..

    అసలే బొమ్మ అదిరింది షోతో శ్రీముఖి జీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ దుమ్ములేపుతోంది. ఇక ఈ స్పెషల్ ఈవెంట్లోనూ ప్రదీప్‌తో కలిసి శ్రీముఖి హల్చల్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరికి పెళ్లి అంటూ చి. ప్రదీప్. చిలసౌ శ్రీముఖి అంటూ ఓ శుభలేఖను కూడా రిలీజ్ చేశారు. దసరా ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలా కనిపిస్తోంది. ఇక ప్రోమోలోనే ఇంత ట్విస్ట్ ఉంటే ఈవెంట్ మొత్తం ఇంకెలా ఉంటుందో చూడాలి.

    Recommended Video

    Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
    ఫ్యాన్స్ రచ్చ..

    ఫ్యాన్స్ రచ్చ..

    అయితే ఈ ప్రోమోను చూసిన ప్రదీప్, శ్రీముఖి అభిమానులు తెగ సంబపపడిపోతున్నారు. విరుష్క(విరాట్, అనుష్క), చైసామ్(నాగ చైతన్య సమంత), నిస్-చై(నిహారిక చైతన్య)లాగా ప్రముఖి (ప్రదీప్ శ్రీముఖి) అంటూ జంటను కలిపేశారు. సూపర్ కాంబో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    English summary
    Zee Telugu Dasara Event 2020 Is Based On Sreemukhi Pradeep Marriage,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X