పబ్లిక్‌గా బుల్లితెర నటితో సరసాలు .. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సెలబ్రిటీ జంట

తెలుగునాట ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పోటీని తట్టుకుని, తమ ప్రత్యర్ధి ఛానెల్స్ మీద ఆధిపత్యం చెలాయించడానికి గాను సరికొత్త థీమ్‌లో కొత్త కొత్త కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నాయి. కామెడీ, వంటలు, డ్యాన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా జీ తెలుగు ఛానెల్ వారు కొత్తగా ఓ షోను ప్రారంభించారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ వేసవిలో కుటుంబ ప్రేక్షకులు, యూత్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసిన జీ తెలుగు ఛానెల్.. సీరియల్స్, షోలు, ఒరిజినల్ కంటెంట్‌తో దూసుకొస్తోంది. సరికొత్త కార్యక్రమాలతో రంగం సిద్ధం చేసింది. గత కొంతకాలంగా రాజకీయాలకే పరిమితమైన సీనియర్ హీరోయిన్, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తిరిగి బుల్లితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. జబర్దస్త్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆమె జీ తెలుగులోనే ఎక్కువగా షోలు చేస్తున్నారు. హీరోయిన్‌గా సంపాదించిన క్రేజ్ కంటే జబర్దస్త్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు రోజా.

Zee Telugu s The Family Assembly Show Launches on April 19 with RK Roja as Judge Promo Goes Viral

కామెడీ స్కిట్ల మధ్యలో ఆమె వేసే పంచ్‌లు, వార్నింగ్‌లు, సెటైర్లు బాగా పేలాయి. అలా జడ్జిగా జబర్దస్త్ షోకు ప్లస్‌గా మారారు. జెన్ జీ జనరేషన్ కూడా రోజాను బాగా గుర్తుపెట్టుకుని, ఆమె హవా ఇప్పటికీ సాగడానికి జబర్దస్త్ ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాలను మించి ప్రతి ఇంటికి రోజా చేరువయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంటికే పరిమితమైన ఆమె రాజకీయ కార్యక్రమాలతో పాటు వెండితెర, బుల్లితెరకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తిరిగి యాక్టీవ్ అయ్యారు రోజా.

ఈ క్రమంలో జీ తెలుగులో త్వరలో ప్రసారం కానున్న ది ఫ్యామిలీ అసెంబ్లీ షోకు జడ్జిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ 19న ఈ షో లాంచ్ అయి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. రోజాతో పాటు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, సింగర్ సమీరా భరద్వాజ్ సహా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తాజాగా ది ఫ్యామిలీ అసెంబ్లీ షోకు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది.

లాంచింగ్ ఎపిసోడ్‌కు జీ తెలుగులో ప్రసారమయ్యే మేఘసందేశం సీరియల్ నుంచి గగన్ (అభినవ్), భూమి (భూమికలు) తమ ఆన్ స్క్రీన్ పేరెంట్స్‌తో వచ్చి సందడి చేశారు. తొలుత భూమి అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతుండగా గగన్ వెనుక నుంచి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఆ వెంటనే భూమి చేతిని ముద్ధాడుతూ తీసుకొచ్చి బుగ్గ నిమురుతూ రొమాన్స్ చేశాడు. భూమి కూడా తక్కువ తినకుండా అతనికి దుప్పటి తీసుకొచ్చి రెచ్చిపోయింది అది చూసి కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. ఇంతలో రోజా వచ్చి అసలు ఈ పిల్లాడు ఏం చేశాడు అని ప్రశ్నించగా.. అల్లాడిపోయాడంటూ సమీరా సెటైర్లు వేసింది.

మా ఇద్దరికీ పెళ్లి చేపిస్తారా అని భూమి అడగ్గా.. పెళ్లి తర్వాతవి కూడా చేసేశారు, ఇక పెళ్లేందుకు అని పంచ్ విసిరింది రోజా. కుడికాలు ముందు పెట్టే ముందు ఎవరితో వచ్చావో చెప్పమని రోజా అడగ్గా.. భూమి, గగన్‌లు సిగ్గుపడతారు. సిగ్గు పడాల్సినవన్ని చేసేశారు.. ఇప్పుడు సిగ్గుపడితే ఏం బాగుంటుందని రోజా మండిపడింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరి భూమి- గగన్‌ల యవ్వారాన్ని రోజా ఎలా పరిష్కరించిందో తెలియాలంటే ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ది ఫ్యామిలీ అసెంబ్లీ కార్యక్రమం చూసేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X