అందులోనూ సత్తా చాటిన ‘జాంబీ రెడ్డి’: రెండోసారి కూడా రికార్డు నమోదు
విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, దక్ష, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జాంబీ రెడ్డి'. కామెడీకి కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ జాంబీ మూవీగా రూపొందిన దీనికి థియేటర్లలో భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లను కూడా ఊహించని స్థాయిలో అందుకుని నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. అదే సమయంలో బుల్లితెరపైనా సత్తా చాటింది. ఈ క్రమంలోనే మరోసారి ఈ సినిమా అదిరిపోయే టీఆర్పీని దక్కించుకుంది.
గత వారం స్టార్ మాలో 'జాంబీ రెడ్డి' మూవీ ప్రీమియర్‌గా ప్రసారం అయింది. రెండోసారి వచ్చినా తెలుగు ప్రేక్షకులు దీనికి మంచి స్పందనను అందించారు. ఫలితంగా దీనికి ఇప్పుడు రికార్డు స్థాయిలో 8.1 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. గతంలో భారీ సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో రేటింగ్ దక్కేది. అలాంటిది ఈ చిన్న చిత్రం ఊహించని స్పందనను దక్కించుకుంది. చిన్న సినిమాల జాబితాలో ఇది ఒక రికార్డుగా చెబుతున్నారు. ఇక, ఈ మూవీ గతంలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయిన సమయంలో దీనికి 9.7 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి కూడా అదే జోరును చూపించి సత్తా చాటింది. దీనిపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

'అ!', 'కల్కి' వంటి ప్రయోగాత్మక చిత్రాలతో వైవిధ్యాన్ని చూపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'జాంబీ రెడ్డి'ని యాపిల్ ట్రీ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. తెలుగులోనే మొట్టమొదటి జాంబీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతం అందించారు. ఇక, ఈ సినిమాలో పృథ్వీ, గెటప్ శ్రీను, హరితేజ, కిరీటి, హేమంత్, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











