మరోసారి సత్తా చాటిన ‘జాంబీ రెడ్డి’: బడా హీరోల సినిమాలకు ధీటైన ఘనత సొంతం
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చే ప్రయోగాత్మక చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి వాటిలో 'జాంబీ రెడ్డి' ఒకటి. విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో తేజ సజ్జా, దక్ష, ఆనంది ప్రధాన పాత్రలు పోషించారు. టాలీవుడ్‌లోనే ఫస్ట్ జాంబీ మూవీగా రూపొందిన దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, కలెక్షన్లనూ భారీ స్థాయిలో రాబట్టింది. తద్వారా నిర్మాతకు లాభాలనూ తెచ్చి పెట్టింది.
కామెడీకి కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో థియేటర్లలో దుమ్ము దులిపేసిన 'జాంబీ రెడ్డి' మూవీ బుల్లితెరపైనా సత్తా చాటింది. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు టీవీలో ప్రసారం అయింది. అన్ని సందర్భాల్లోనూ దీనికి మంచి రేటింగ్ వచ్చింది. ఈ మూవీ గతంలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయిన సమయంలో దీనికి 9.70 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి కూడా అదే రీతిలో 8.10 రేటింగ్‌ను అందుకుంది. ఇక, తాజాగా మూడోసారి ప్రసారం అయిన ఈ చిత్రానికి 7.42 రేటింగ్ దక్కింది. మూడుసార్లు కూడా భారీ స్పందనను అందుకున్న ఈ సినిమా బడా మూవీలకు సమానమైన రేటింగ్‌ను సాధించడం విశేషం.

ప్రశాంత్ వర్మ 'అ!', 'కల్కి' వంటి ప్రయోగాత్మక చిత్రాల తర్వాత రూపొందించిన 'జాంబీ రెడ్డి'కి ఓటీటీలోనూ మంచి స్పందన వచ్చింది. అక్కడ కూడా ఎక్కువ క్లిక్స్ అందుకున్న మూవీగా ఇది నిలిచింది. ఈ చిత్రాన్ని యాపిల్ ట్రీ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. తెలుగులోనే మొట్టమొదటి జాంబీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతం అందించారు. ఇక, ఈ సినిమాలో పృథ్వీ, గెటప్ శ్రీను, హరితేజ, కిరీటి, హేమంత్, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











