అక్కడ కూడా సత్తా చాటిన ‘జాంబీ రెడ్డి’: రికార్డు స్థాయి రేటింగ్ నమోదు చేసిన మూవీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక చిత్రాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారడానికి తోడు దర్శక నిర్మాతలు సరికొత్త ఆలోచనలు చేస్తుండడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. ఇలా వినూత్నమైన కథాంశంతో ఇటీవల వచ్చిన చిత్రం 'జాంబీ రెడ్డి'. 'అ!', 'కల్కి' వంటి ప్రయోగాత్మక చిత్రాలతో వైవిధ్యాన్ని చూపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను రూపొందించాడు. థియేటర్లలో సత్తా చాటిన ఈ ప్రయోగత్మక చిత్రం ఇటీవలే బుల్లితెరపైనా సందడి చేసింది. దీనికి అక్కడ కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
బికినీలో బోల్డ్ భామ... స్విమ్మింగ్‌పూల్‌లో హాట్ హాట్‌గా అందాల ఆరబోత
తేజ సజ్జా, దక్ష, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జాంబీ రెడ్డి'. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా కలెక్షన్లను కూడా ఊహించని స్థాయిలో అందుకుని నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే గత వారం స్టార్ మాలో ప్రీమియర్‌గా ప్రసారం అయింది. దీనికి రికార్డు స్థాయిలో 9.7 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. భారీ చిత్రాలకు మాత్రమే గతంలో ఈ తరహా రేటింగ్ వచ్చేది. కానీ, ఇప్పుడు మాత్రం 'జాంబీ రెడ్డి' ఈ మార్కును నమోదు చేయడం చిత్ర యూనిట్‌లో జోష్‌ను నింపేసిందనే చెప్పాలి.

ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన 'జాంబి రెడ్డి' ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రేక్షకులకు థ్రిల్‌గా ఉంచుతూనే కామెడీతో నవ్వించింది. ఈ కారణంగా ఇది భారీ విజయాన్ని దక్కించుకుంది. మరోవైపు, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఇందులో అక్కినేని సమంత నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను యాపిల్ ట్రీ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. తెలుగులోనే మొట్టమొదటి జాంబీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











