X
Home టాప్ లిస్టింగ్

వెర్సటాలిటీకి కేరాఫ్ విజయ్ దేవరకొండ.. బ‌ర్త్ డే స్పెష‌ల్‌గా సినీ జ‌ర్నీలో కొన్ని విశేషాలు.

Author Administrator | Published: Tuesday, May 9, 2023, 12:57 PM [IST]

హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవ‌టం అంత సుల‌భం కాదు.. మ‌రీ ముఖ్యంగా హీరో వ‌ర్షిప్ ఎక్కువ‌గా ఉండే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అయితే అలాంటి గుర్తింపు కోరుకునే కుర్ర కారు ఎక్కువ‌. మ‌రీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కు, యూత్‌కు క‌నెక్ట్ అయితే వ‌చ్చే మాస్ ఇమేజ్‌లో కిక్కే వేరు. అలాంటి ఇమేజ్‌ను అతి త్వ‌ర‌గా వ‌డ‌సి ప‌ట్టేసిన హీరో విజ‌య్ దేవ‌కొండ‌. ఆ క్రేజ్‌, ఇమేజ్‌ను నిల‌బెట్టుకోవ‌టానికి త‌ను ఇప్ప‌టికీ త‌ప‌న ప‌డుతూనే ఉంటారు. అభిమానులు ప్రేమ‌గా రౌడీ స్టార్ అని పిలుచుకునే విజ‌య్ దేవ‌ర‌కొండ జ‌ర్నీలో కొన్ని విశేషాలు..


cover image
1

వ‌చ్చీ రాగానే విజ‌య్ దేవ‌కొండ‌కు సినీ ఇండ‌స్ట్రీ ఎర్ర తివాచీ వేయ‌లేదు. సినిమాల‌పై ఆస‌క్తితో అడుగు పెట్టి చిన్న చిత‌క పాత్ర‌ల్లోనూ న‌టించారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమానే. అలా కొన్ని సినిమాల్లో న‌టించిన త‌న‌కు వచ్చిన తొలి బ్రేక్‌.. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో కాదు. స‌పోర్టింగ్ రోల్‌. త‌న పాత్ర ప‌రిధి కూడా చాలా చిన్న‌దే. అయితేనేం. త‌న‌దైన న‌ట‌న‌తో ఆ పాత్ర‌కు కొత్త‌ద‌నాన్ని ఆపాదించ‌టంతో ఇండ‌స్ట్రీ దృష్టిలో ప‌డ్డారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

2

త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన పెళ్లిచూపులు చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. అందులో త‌న పాత్ర నేటి యువ‌త‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉండ‌టంతో యూత్ అంతా త‌న‌కు ఫిదా అయ్యింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌టంతో రౌడీ స్టార్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు. ఆ త‌ర్వాత చేసిన అర్జున్ రెడ్డిలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న అల్టిమేట్‌. పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిపోయింది. దాంతో రాత్రికి రాత్రే విజ‌య్‌కి స్టార్ హీరో ఇమేజ్ వ‌చ్చేసింది. అదే జోరుతో అర్జున్ రెడ్డికి భిన్నంగా చేసిన గీత గోవిందం సినిమా ఏకంగా రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టడంతో టాప్ లీగ్ హీరో లిస్టులోకి మ‌న హీరో చేరిపోయాడు. ఇంకేముంది స్టార్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు క్యూ క‌ట్టారు. 

3

మాస్ పాత్ర‌ల‌నే చేయాల‌నే ఉద్దేశం త‌న‌లో ఉండ‌దు. అందుకు త‌ను ఎంచుకునే సినిమాలే కార‌ణం. డియర్ కామ్రేడ్ బెస్ట్ ఎగ్జాంపుల్‌. ఈ సినిమాతో పాటు త‌ర్వాత చేసిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, లైగర్ చిత్రాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. అయితే త‌నేం వెనుక‌డుగు వేయ‌లేదు. రెట్టించిన ఉత్సాహంతో ఖుషి సినిమా చేస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఫ్లాప్స్‌, స‌క్సెస్‌ల గురించి ఆలోచించి సినిమాలు చేయ‌న‌ని, మంచి స్క్రిప్ట్ అనిపిస్తేనే చేస్తామ‌ని, అయితే కొన్ని సార్లు మ‌న అంచ‌నాలు త‌ప్పుతాయ‌ని ప‌లు సంద‌ర్భాల్లో త‌న ఓటిమిపై ఓపెన్‌గానే బ‌దులిచ్చారు విజ‌య్ దేర‌వ‌కొండ‌. 

4

విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ ఎంత స్పీడుగా ఎదిగింది. త‌న చుట్టూ వివాదాలు కూడా అలాగే క్రియేట్ అయ్యాయి. అర్జున్ రెడ్డి స‌మ‌యంలో త‌న లిప్ లాక్ సీన్‌పై రేగిన వివాదం, ఏదైనా ఓపెన్‌గా మాట్లాడే నైజం, త‌న సినిమాల్లో కొన్ని ఇబ్బందిక‌ర‌మైన ప‌దాలున్న డైలాగ్స్ ఉండ‌టం ఇవ‌న్నీ రౌడీ స్టార్‌ను కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌గా మార్చాయి. అయినా కూడా త‌నెక్క‌డా త‌గ్గ‌లేదు. 

5

సినిమాల్లోనే కాదు.. సామాజికి సేవ‌లోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటూనే వ‌చ్చారు. కోవిడ్ స‌మ‌యంలో ఓ ఫౌండేష‌న్‌ను స్టార్ట్ చేసి అందులో భాగంగా ఓయాప్‌ను క్రియేట్ చేసి ఎవ‌రైనా నిత్యావ‌స‌ర వ‌స్తువులు కావాల‌నుకుంటే ఆ యాప్ ద్వారా సంప్ర‌దించ‌మ‌ని చెప్పి, త‌న అభిమానుల ద్వారా చాలా మందికి స‌పోర్ట్ చేశారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అంతే కాకుండా కొంత మంది యువ‌కుల‌తో క‌లిసి ఓ క‌న్సెల్‌టెన్సీ లాంటిది స్టార్ట్ చేసి యూత్‌కు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే ప‌నుల‌ను కూడా చేస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.  ఎప్పటిక‌ప్పుడు త‌న వెర్స‌టాలిటీతో అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ యంగ్ హీరో ఇలాంటి పుట్టిన‌రోజుల‌ను మ‌రెన్నింటినో జ‌రుపుకోవాల‌ని కోరుకుందాం..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+