By : Filmibeat Telugu Video Team
Published : May 17, 2022, 05:10
Duration : 01:44
01:44
ఒక మూగ జీవి ప్రేమ కథ - 777 చార్లీ
కన్నడ హీరో రక్షిత్ శెట్టి సౌత్‌లో పాగా వేసేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇంతకు ముందు అతడే శ్రీమన్నారాయణ సినిమాతో ఒక్కసారిగా సౌత్ మొత్తానికి తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ చిత్రం దారుణంగా బెడిసి కొట్టేసింది. అయితే ఇప్పుడు మరోసారి అందరినీ మెప్పించేందుకు రక్షిత్ శెట్టి వస్తున్నాడు.ఈ సారి జంతువుతో మనిషికి ఉండే ఎమోషనల్ కనెక్షన్ మీద సినిమా తీశాడు. 777 చార్లీ అనే సినిమాలో కుక్కను స్పెషల్‌గా చూపించబోతోన్నాడు. హీరోకి తనకంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని అనుకున్న సమయంలో ఈ చార్లీ (కుక్క) ఎంట్రీ ఇస్తుంది. దాని వల్ల హీరోకు ఎదురైన కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఏంటి? చివరకు ఆ చార్లీ కోసం హీరో ఏం చేశాడన్నదే కథాంశం.