By : Filmibeat Telugu Video Team
Published : May 13, 2022, 04:30
Duration : 13:45
13:45
గమ్మత్తైన కథతో BFF వెబ్ సిరీస్
తెలుగు వెబ్ సిరీస్ కు సరికొత్త జీవం పోస్తున్న ఆహా తాజాగా మరోక ఆహ్లాదకమైన వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆద్యంతం వినోదభరితమైన బీఎఫ్ఎఫ్ త్వరలోనే ఆహా ఓటీటీలో విడుదలవ్వబోతోంది. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అడల్టింగ్ అనే వెబ్ సిరీస్ స్ఫూర్తితో రూపొందిన బీఎఫ్ఎఫ్ అదే స్థాయిలో రింజింపజేయబోతోందని అర్ధమవుతోంది.ఇటీవలే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించగా బీఎఫ్ఎఫ్ యూనిట్ మొత్తం కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.ఇక సిరీస్ లో లీడ్ రోల్స్ చేస్తున్న సిరి హనుమంత్, రమ్య పసుపలేటి సిరీస్ ద్వారా మంచి నటిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా, తమ పాత్రలు అందరికీ దగ్గర అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.