రష్మికతో బ్రేకప్.. రక్షిత్‌ గ్రేట్ అంటూ సందేశాల వెల్లువ !


కన్నడ తారలు రక్షిత్‌శెట్టి, రష్మిక్ మందన్న బ్రేకప్ వార్తలు మీడియాలో సంచలనం రేపాయి. వీరి నిశ్చితార్థం రద్దు కావడం వెనుక చాలా కారణాలు వినిపించాయి. మీడియాలో విభిన్న కథనాలు వినిపించడంతో రష్మిక తల్లి సుమన్ మందన్న ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి కూడా స్పందించి తగిన వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో రష్మికను గానీ, మరొకరిని గానీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఈ ఇలాంటి ఘటనతో మనస్థైర్యాన్ని కోల్పోయిన రష్మికకు అండగా నిలిచారు. ఆమె జీవితాన్ని ప్రశాంతంగా గడపనివ్వండి అంటూ రక్షిత్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. రక్షిత్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుపై అభిమానులు, నెటిజన్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Have a great day!
Have a great day!