`ఆట కదరా శివా` పాట రిలీజ్ చేసిన వెంకీ


ప‌వ‌ర్‌`, `లింగా`, `బ‌జ‌రంగీ భాయీజాన్‌` వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం `ఆట‌గ‌ద‌రా శివ‌`. రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందిస్తున్నారు. `ఆ న‌లుగురు`, `మ‌ధు మాసం`, `అంద‌రి బంధువ‌య‌`తో ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను స్పృశించిన సెన్సిటివ్‌ ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఉద‌య్ శంక‌ర్ క‌థానాయ‌కుడు. జూలై 14న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో రామ రామ రే.. పాటను గురువారం విక్ట‌రీ వెంక‌టేశ్ విడుద‌ల చేశారు.
ఈ సంద‌ర్భంగా వెంక‌టేశ్ మాట్లాడుతూ ‘మంచి ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో సినిమాల‌ను డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ‌ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న `ఆట‌గ‌దరా శివ‌` మంచి స‌క్సెస్ కావాల‌ని, అలాగే నిర్మాత‌కు మంచి ప్రాఫిట్స్ రావాల‌ని అశిస్తున్నాను. రామ రామ రే.. సాంగ్‌ ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’ అని తెలిపారు.

Have a great day!
Have a great day!