By: Filmibeat Telugu Video Team
Published : December 07, 2017, 02:59

లాస్యకు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడం కూడా రాదు !

Subscribe to Filmibeat Telugu


ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నా యాంకర్ రవి మీదనే ఎందుకు ఇన్ని వివాదాలు... అనే ప్రశ్నకు యాంకర్ రవి సమాధానం ఇచ్చారు. నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించలేదు. నా ఇమేజ్ ఇలా ఉండాలని, నా గురించి ప్రజలు మంచి మాత్రమే మాట్లాడుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రతి మనిషిలోనూ నెగెటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి. కానీ జనాలు దాన్ని ఒప్పుకోరు. నాపై ఇలాంటి వివాదాలు రావడానికి అది కూడా కారణం అయి ఉండొచ్చని రవి తెలిపారు.
నేను అన్ని విషయాల్లోనూ ఓపెన్ గా ఉంటాను. నాతో ఎవరైనా అమ్మాయి కంఫర్టబుల్ గా ఉంటేనే వాళ్లను పట్టుకోవడం, నాకు దగ్గరగా లాక్కోవడం, వారితో డాన్స్ చేయడం లాంటివి చేస్తాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవి తెలిపారు.
నా ప్రవర్తన కంప్లైయింట్ చేసేంత ఓవర్ గా మాత్రం ఉండదు. నేను చేసేది ఎవరైనా అమ్మాయికి నచ్చట్లేదు అని తెలిస్తే వెంటనే ఆపేస్తాను. వాళ్లు ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నపుడే అలా చేస్తాను.
లాస్యతో కాంట్రవర్సీ ఏమీ లేదు. మా ఇద్దరి పెయిర్ తెరపై బావుందని చాలా మంది ప్రశంసించారు. ఆమెకు అసలు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. యాంకర్ అవ్వాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు రావడం మొదలైన తర్వాత నేను దగ్గరుండి అన్ని చెప్పాను.... అని రవి తెలిపారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు