By : Filmibeat Telugu Video Team
Published : February 22, 2021, 11:50
Duration : 05:24
05:24
బెజవాడ నాయకుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి - దేవినేని డైరెక్టర్
బెజవాడలో దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య కథా నేపథ్యంతో ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి తారకరత్న హీరోగా, జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'దేవినేని. బెజవాడ సింహం అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత డియస్ రావు దేవినేని ఆడియోను విడుదల చేశారు. ఈ చిత్రం లో నటించిన తుమ్మల పల్లి రామ సత్యనారాయణ, బాక్పాఫీస్ చందు రమేష్, లక్ష్మీ నివాస్, లిరిక్ రైటర్ మల్లిక్, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.