By : Filmibeat Telugu Video Team
    Published : August 19, 2019, 07:00
    Duration : 01:58

    హవా మూవీ 20 సెకండ్స్ ప్రోమోస్

    డిఫరెంట్ స్టోరీస్ అనే మాట తరచూ వింటుంటాం.. కానీ అలా అనిపించుకున్న సినిమాలు తక్కువే. అయితే మోషన్ టీజర్ నుంచే మోస్ట్ ఇన్నోవేటివ్ అనిపించుకున్న సినిమా ‘హవా’. ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా వస్తోన్న ఈ సినిమాకు క్యాప్షన్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్లు ఎంత డిఫరెంట్ స్టోరీతో వస్తున్నారనేది. 9గంటలు, 9బ్రెయిన్స్, 9 నేరాలు అనేదే ఆ క్యాప్షన్. అంటే సినిమా కేవలం 9 గంటల కాలంలో నడుస్తుందన్నమాట. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోన.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. ఇక రేసీగా సాగే స్క్రీన్ ప్లే సినిమాకు మేజర్ హైలెట్ అవుతుంది. తెలుగులో ఇప్పటి వరకూ ఇలాంటి కథనంతో సినిమా రాలేదనుకోవచ్చు. ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా అంతా పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరణ జరుపుకుంది. పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించిన తొలి తెలుగు తెలుగు సినిమానూ ఈ చిత్రం రికార్డ్ సాధించింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X