By: Filmibeat Telugu Video Team
Published : January 12, 2018, 07:22

కరణ్ విషం తాగిస్తాడు..జాగ్రత్త ! కంగన షాకింగ్ కామెంట్..!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అందాల భామ కంగనా రనౌత్, దర్శకుడు కరణ్ జోహర్ మధ్య ఒకప్పుడు పచ్చ గడ్డి వస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ మధ్య ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ అనే టెలివిజన్ షో షూటింగ్ సందర్భంగా వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించడం చర్చనీయాంశమైంది. వారి మధ్య ఉన్న వివాదాలను దూరం పెట్టినట్టు కనిపించిందట.
ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ సెట్లో కరణ్, కంగన ఒకరిపై మరొకరు జోకులు, సెటైర్లు వేసుకుంటూ చాలా ఆనందంగా గడిపారు అని సెట్ నిర్వాహకులు కథనం.
ఈ గేమ్ షూట్ సందర్భంగా అతిథులకు స్వయంగా కరణ్ వడ్డించారట. అలా వడ్డించేటప్పుడు వెనుక నుంచి కరణ్ మీకు విషం తాగిస్తాడు జాగ్రత్త అని కంగన ఓ కామెంట్ విసిరిందట. దాంతో కరణ్ ఒక్కసారిగా షాక్ అయి చూడగానే కంగన రనౌత్ నవ్వుతూ కనిపించిందట.
బాలీవుడ్‌లో బంధుప్రీతిపై కంగన రనౌత్ కామెంట్స్ చేయడం వివాదామైన సంగతి తెలిసిందే. అలాగే కరణ్ జోహర్‌కు బంధుప్రీతి ఎక్కువ అని కంగన ఓ దశలో విరుచుకుపడింది. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది.
ఈ నేపథ్యంలో ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ గేమ్ షోల పాల్గొనాలని కంగనకు ఆహ్వానించగా ఏ మాత్రం సంకోచించలేదట. నాకు వారు డబ్బులు ఇచ్చి షోలో పాల్గొనమన్నప్పడు ప్రొఫెషనల్‌గానే ఆలోచించాను. కరణ్ జోహర్‌తో నాకు ఎలాంటి ప్రొఫెషనల్ విబేధాలు లేవు అని కంగన చెప్పింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు