By: Filmibeat Telugu Video Team
Published : February 13, 2018, 12:21

చిరు-మహేష్‌లతో భారీ ఈవెంట్, కత్తిరిస్తామని హీరోయిన్లకు హెచ్చరిక!

Subscribe to Filmibeat Telugu

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో టాలీవుడ్ సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో అంగ‌రంగ‌వైభంగా క‌ర్టైన్ రైజ‌ర్ వేడుక జ‌రిగింది. తాజాగా ''మా'' విదేశాల్లో సెల‌బ్రేట్ చేసేందుకు కూడా ముహూర్తం పెట్టేసింది. ఏప్రిల్ 28న అమెరికా డ‌ల్లాస్ లో తొలి ఈవెంట్ గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది.
అమెరికాలో జరిగే ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌వుతున్న‌ట్లు `మా` అధ్యక్షుడు శివాజీ రాజా సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలిపారు. ఈవెంట్‌ను ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్- తిరుమ‌ల ప్రొడ‌క్ష‌క‌న్స్ ప్రైవెట్ లిమిటెడ్ సంయుక్త‌గా అమెరికాలో నిర్వ‌హిస్తున్నాయి. ఇంకా చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఈవెంట్ చేస్తున్నాం. దాదాపు 8000 నుండి10,000 సామార్ధ్యం గ‌ల ఆడిటోరియంలో ఈవెంట్ జ‌ర‌గ‌నుంది` అని తెలిపారు.
శివాజీ రాజా మాట్లాడుతూ, `చిరంజీవిగారికి `మా` వేడుక‌లు గురించి చెప్ప‌గానే వెంట‌నే ఒప్పు కున్నారు. ఎక్క‌డికి రావడానికైనా సిద్దంగా ఉన్నాన‌ని హామీ ఇచ్చారు. అలాగే మ‌హేష్ బాబు గారు కూడా మేలో జ‌రిగే ఓ ఈవెంట్‌కు వ‌స్తాన‌న్నారు. వీరిద్ద‌రూ మాకు ఎంతో స‌హాకారాన్ని అందిస్తున్నారు. అలాగే బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, వెంక‌టేష్, నాగార్జున కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. `మా` కోసం ఎంత‌క‌ష్ట‌మైనా ప‌డ‌టానికి నేను..మాటీమ్ సిద్దంగా ఉన్నాం.... అన్నారు.
అలాగే ప‌ర‌భాషా హీరోయిన్లు అయినా...మ‌న తెలుగు హీరోయిన్లు అయినా స‌రే క‌చ్చితంగా `మా` లో మెంబ‌ర్ షిప్ తీసుకోవాలి. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిందంటే `మా` ముంద‌కు వ‌స్తున్నారు గానీ, అప్ప‌టివ‌ర‌కూ మేము గుర్తు రావ‌డం లేదు. ఆ స‌మ‌యంలో ఒక చేత్తో `మా` మెంబ‌ర్ షిప్ ఫార‌మ్...మ‌రో చెత్తో కంప్లైట్ ఫార‌మ్ తీసుకుని వ‌స్తున్నారు. ప‌రిస్థితి అంత‌వ‌ర‌కూ తెచ్చుకోవ‌ద్ద‌ని కోరుకుంటున్నాం... అని శివాజీరాజా తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు