By : Filmibeat Telugu Video Team
Published : July 15, 2017, 05:21
నాని అస్సలు ఆగడం లేదు గా...ఒకే సారి రెండు సినిమాలు...
ఎంసీఏ పేరుతో నాని తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరాం వేణు దర్శకత్వం వహిస్తుండగా.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాని 21వ చిత్రానికి కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హిప్‌ హాప్‌ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. తాజాగా నాని 20వ చిత్రం ఎంసిఏ లోగో తో పాటు నాని 21వ చిత్రం కృష్ణార్జున యుద్ధం టైటిల్ లోగోని విడుదల చేశారు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు