By : Filmibeat Telugu Video Team
Published : October 11, 2019, 10:06
Duration : 00:47
00:47
హ్యాపీ బర్త్ డే మారుతి
మారుతి.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో సపరేట్ క్రేజ్ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చచ్చిపోతున్న చిన్న సినిమాకు ప్రాణం పోసింది ఈయనే. అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి అసాధ్యుడిగా మారిపోయాడు ఈయన. ఈ రోజుల్లో అంటూ చిన్న సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టాడు మారుతి. దానికి ముందు పోస్టర్ డిజైనింగ్స్, మల్టీమీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. ఈ రోజుల్లో సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత బస్టాప్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. అయితే బూతు సినిమాల దర్శకుడిగా విమర్శలు కూడా అందుకున్నాడు.