By : Filmibeat Telugu Video Team
Published : January 18, 2021, 05:20
Duration : 01:55
01:55
టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత.. ఎన్టీఆర్ ఎమోషనల్
తెలుగు సినీ ఇండస్ట్రీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కరోనా సమయంలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత, డిస్ట్రీబ్యూటర్, మాజీ ఎమ్మెల్యే అయిన దొరస్వామి రాజు మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోన్న ఆయన.. హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్ర పొందుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన తుది శ్వాసను విడిచారు. సీనియర్ ప్రొడ్యూసర్ మరణంతో చిత్ర సీమలో విషాదం అలముకుంది. ఆయన మృతిపై ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు