By: Filmibeat Telugu Video Team
Published : February 13, 2018, 10:04

ఉపాసన న్యూ లుక్ మైండ్ బ్లోయింగ్.!

Subscribe to Filmibeat Telugu

ఓ ఐదున్నర సంవత్సరాలు వెనక్కి వెళితే..... రామ్ చరణ్- ఉపాసన పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించగానే సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ జోడీలా ఈ జంట లేదంటూ చాలా మంది కామెంట్లు చేశారు. ఆ సమయంలో ఉపాసన కాస్త లావుగా, బొద్దుగా ఉండటమే అందుకు కారణం. కట్ చేస్తే.... ఇపుడు ఉపాసన లుక్ పూర్తిగా మారిపోయింది.
తనపై వచ్చిన ఈ విమర్శలను ఉపాసన చాలా సీరియస్‌గా తీసుకుందో? ఏమో? తెలియదు కానీ.... ఎవరైతే విమర్శలు చేశారో వారి నోరు మూయించడానికి చాలా కష్టపడ్డారు. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోకుండా స్లిమ్ లుక్‌తో అదరగొడుతున్నారు.
ఉపాసన తాజా లుక్ చూసిన ఎవరైనా ఆమె గురించి ఇక ఎలాంటి కూతలు కూయలేరు. తనకు అందమైన రూపం మాత్రమే కాదు, అందమైన మనసు కూడా ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ కొణిదెల కోడలు పిల్ల. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ గొప్పమనసు చాటుకుంటున్నారు.
ఉపాసన తన పుట్టింటి వారు నిర్వహిస్తున్న అపోలో ఆసుపత్రి డైరెక్టర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తన ప్రొఫెషన్లో ఆమె బిజీగా ఉంటూనే.... ఇటు అత్తింటి వారికి ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా మసులుకుంటూ రెండు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. మెగా అభిమానులు మెచ్చిన కోడులుగా పేరు తెచ్చుకున్నారు.
రామ్ చరణ్, ఉపాసన చిన్ననాటి నుండి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన.... తన పోస్టుల్లో రామ్ చరణ్ గురించి అంశాల గురించే ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. రామ్ చరణ్ సినిమాలను ప్రమోట్ చేస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంటారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు