By : Filmibeat Telugu Video Team
Published : January 12, 2018, 05:33
అభిమానుల కాళ్లు మొక్కిన హీరో సూర్య.. ఏం జరిగింది?
సౌత్‌లో సినిమా హీరోలపై అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ, తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువ. స్టార్ హీరోలకు కేవలం అభిమానులే కాకుండా భక్తులు కూడా ఉంటారు. తమ హీరోను దేవుడుగా భావిస్తారు, ఎదురుగా కనబడితే కాళ్లమీద పడిపోతారు. అలాంటి సంఘటనే తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే హీరో సూర్య స్పందించిన తీరు అందరూ షాకయ్యేలా చేసింది.
సూర్య నటించిన ‘గ్యాంగ్' మూవీ తమిళంతో పాటు తెలుగులో విడుదలవ్వబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల తమిళనాడులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా సూర్య స్వయంగా అభిమానుల కాళ్లు మొక్కడంతో అంతా షాకయ్యారు.
‘గ్యాంగ్' మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుండగా కొందరు అభిమానులు సూర్యను కలవడానికి స్టేమీ మీదకు వచ్చారు. అయితే వారు వచ్చి రాగానే అందరూ సూర్య కాళ్లకు మొక్కడం మొదలు పెట్టారు. అయితే వెంటనే సూర్య వాళ్లందరి కాళ్లకు తిరిగి మొక్కడంతో అంతా ఆశ్చర్యపోయారు.
చాలా మంది హీరోలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ ఏ హీరో కూడా తిరిగి అభిమానుల కాళ్లకు మొక్కలేదు. అయితే సూర్య ఇలా చేయడం వెనక చాలా అర్థం ఉందని, ఇంకోసారి ఎవరూ తన కాళ్లకు మొక్కకుండా ఉండేందుకే ఆయన ఇలా చేశారని అంటున్నారు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు