By: Filmibeat Telugu Video Team
Published : January 13, 2018, 01:48

'కత్తి' లో తెలియని కోణాలు.. ఫ్యాన్స్‌తో వివాదంపై తమ్మారెడ్డి !

Subscribe to Filmibeat Telugu

ఓవైపు ఫ్యాన్స్ దూకుడు.. మరోవైపు వెనక్కి తగ్గని కత్తి.. వెరసి నెలల తరబడి నిత్యం వార్తల్లో నానుతున్న వివాదం. ఈ వివాదానికి క్లైమాక్స్ ఏంటనేది ఇంతవరకు ఎవరికీ అంతుచిక్కడం లేదు. 'అజ్ఞాతవాసి' ఫలితం గనుక మరోలా ఉండి ఉంటే పవన్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి యుద్దం మరోలా ఉండేదేమో!. సరే, అంతకుముందే రచయిత కోన వెంకట్ ఓ డెడ్ లైన్ కూడా ప్రకటించేశారు. ఆ డెడ్ లైన్ తర్వాత ఏం చేయబోతున్నారన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోన్న అంశం. ఇకపోతే ఈ వైరాన్ని సద్దుమణిగించే నాథుడే ఇండస్ట్రీలో కరువయ్యాడా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
ఈ విషయంలో కత్తి మహేష్‌కి నేను చాలా సార్లు చెప్పాను. మన అభిప్రాయం ఎదుటివాళ్లకి నచ్చనప్పుడు వాళ్లు తిడతారు. మళ్లీ దానిపై రెస్పాండ్ అయితే ఇలాగే ఉంటుంది.
నేను కూడా హీరోలను తిట్టాను. నన్ను ఆ హీరోల అభిమానులు తిడుతూ పోస్ట్‌లు చేస్తుంటారు. వాటిపై నేను మళ్లీ రెస్పాండ్ అయితే పెద్ద వివాదం అవుతుంది. అందుకే తిడితే తిట్టారులే అని ఊరుకుంటాను. అంతే ఫుల్ స్టాప్. ఇదే విషయం కత్తి మహేష్‌కి చాలా సార్లు చెప్పారు. అయినా వినలేదు.
పవన్ కల్యాణే రావాలి. నా సమస్య తీర్చాలి అంటే నేనేం చేయను. కొట్టి చెప్పమంటారా? తిట్టి చెప్పమంటారా?.. ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు