By : Filmibeat Telugu Video Team
    Published : September 27, 2019, 06:10
    Duration : 01:39

    త్రివిక్రమ్ ని థ్రిల్ చేసిన 'రాగల 24 గంటల్లో' టీజర్

    టాలెండెట్ యాక్టర్ సత్యదేవ్, తెలుగమ్మాయి ఇషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘యమగోల - మళ్లీ మొదలైంది’, ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’, ‘ఢమరుకం’ సినిమాల దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తు్న్నారు.శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు చిత్ర ప్రచారంలో భాగంగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X