By: Filmibeat Telugu Video Team
Published : January 13, 2018, 11:34

'అజ్ఞాతవాసి'లో భారీ మార్పులు-చేర్పులు.. వెంకీ స్టిల్స్ అదిరిపోయాయి..

Subscribe to Filmibeat Telugu


'అజ్ఞాతవాసి'పై అభిమానులవి ఎన్నెన్ని అంచనాలో. అన్నీ బోల్తా కొట్టేశాయి. ఆ అంచనాల్లో సగం అందుకున్నా వాళ్లలో ఇంత నిరాశ ఉండేది కాదేమో!. మొత్తానికి త్రివిక్రమ్ చాలా దారుణమైన దెబ్బేశాడనే బాధలో పవన్ అభిమానులు ఉన్నారు. ఆ లోటును కాస్తయినా భర్తీ చేయడానికా? అన్నట్లు ఇప్పుడు 'అజ్ఞాతవాసి'కి మార్పులు-చేర్పులు జరగబోతున్నాయి.
నిజానికి పవన్-వెంకీ ట్రాక్ సినిమాలో ఉండి ఉంటే కాస్తయినా సినిమాకు హెల్ప్ అయ్యేదని త్రివిక్రమ్ పునరాలోచనలో పడ్డారేమో!. అందుకే ఇప్పుడు 'అజ్ఞాతవాసి'కి తిరిగి ఆ ట్రాక్ చేర్చబోతున్నారు. ఇప్పటికే సినిమాకు పూడ్చలేనంత డ్యామేజ్ జరగడంతో.. ఈ ట్రాక్ కొంతలో కొంతైనా ఊరట కలిగిస్తుందేమో అని భావిస్తున్నారు.
'అజ్ఞాతవాసి' సినిమాపై తొలి నుంచి ధీమాగా ఉన్న పవన్-త్రివిక్రమ్.. వెంకీ కామెడీ ట్రాక్ ను తర్వాత యాడ్ చేద్దాంలే అనుకున్నారట. సినిమా విడుదలై ఎలాగూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది కాబట్టి.. సంక్రాంతికి 'వెంకీ' సీన్స్ యాడ్ చేస్తే కలెక్షన్స్ జోరు పెరుగుతుందని భావించారట. కానీ వాళ్ల అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.
'అజ్ఞాతవాసి' పరాభవం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను కోలుకోలేని దెబ్బతీసేదిగా మారింది. ఆ పరిస్థితి నుంచి కాస్తయినా గట్టెక్కాలంటే నిలకడగా కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. వెంకీ సీన్స్ యాడ్ చేయడం ద్వారా థియేటర్లకు ప్రేక్షకులను మళ్లీ రప్పించవచ్చు అని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్-వెంకీ కామెడీ ట్రాక్ సినిమాను ఎంతమేర గట్టెక్కిస్తుందో తెలియదు కానీ.. చిత్ర యూనిట్ మాత్రం భారీ ఆశలే పెట్టుకుంది. అందుకే, దీనికి సంబంధించిన పబ్లిసిటీపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. శుక్రవారం ఓ వీడియో ద్వారా 'వెంకీ' సీన్స్ యాడ్ చేయబోతున్నట్లు ప్రకటించిన నిర్మాతలు.. తాజాగా కొన్ని స్టిల్స్ విడుదల చేశారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు