Tap to Read ➤

ఈ వారం థియేటర్స్, ఓటీటీ ల్లో విడుదల అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు

థియేటర్లలో, ఓటీటీ ల్లో ఈ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు వెబ్ సిరీస్‌లు ఓ లుక్ వేయండి.
Ram reddy
మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా తదితరులు నటించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న విడులవుతోంది
హరి కొలగాని దర్శకత్వంలో సాయి దన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్ హీరోలుగా నటించిన సినిమా షికారు. ఈ సినిమా జులై 1న విడుదలవుతోంది.
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. ఈ సినిమా జూలై 1న విడులవుతోంది
తమిళ దర్శకుడు హరి తెరకెక్కించిన తాజా సినిమా 'ఏనుగు'. ఈ సినిమా జులై 1న విడుదల కానుంది
సందీప్‌ మాధవ్‌, గాయత్రి ఆర్‌.సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’జులై 1న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు
నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' కూడా జూలై 1న విడుదల కానుంది.
బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ కెరీర్‌లో అతి పెద్ద ఫ్లాప్‌ మూవీ ‘ధాకడ్‌’. జీ5 ఓటీటీలో జులై 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సమ్రాట్‌ పృథ్వీరాజ్‌’అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జులై 1 నుంచి అందుబాటులోకిరానుంది.
అన్యాస్‌ ట్యుటోరియల్‌ వెబ్‌ సిరీస్‌ రెజీనా, నివేదితా సతీష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జులై 1 నుంచి తెలుగు, తమిళంలో ఆహా ఓటీటీ వేదికలో ప్రసారం కానుంది.