Tap to Read ➤

ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే 9 తెలుగు సినిమాలు ఇవే.

ఈ వారం థియేటర్స్ లో ఏకంగా 9 సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాబోతున్నాయి.
కొండా మురళీ, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ కొండా. ఈ సినిమా జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది
‘సమ్మతమే’ సినిమా హీరో కిరణ్‌ అబ్బవరం, చాందిని చౌదరి కథానాయిక. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం. జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
యంగ్ హీరో ఆకాష్ పూరీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ఈనెల 24న విడుదలవుతోంది.
జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా ఘనంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హరి కొలగాని దర్శకత్వంలో సాయి దన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్ హీరోలుగా నటించిన సినిమా షికారు. ఈ సినిమా 24న విడుదలవుతోంది.
లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్, వైష్ణవి, నాజర్, అలీ తదితరులు నటించిన 'సదా నన్ను నడిపే' మూవీ జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'సాఫ్ట్ వేర్ బ్లూస్' జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఒక పథకం ప్రకారం'. ఈ సినిమా 24న విడుదలవుతోంది.