Tap to Read ➤

టాలీవుడ్ 2022 డిజాస్టర్స్.. ఇప్పటికే ఈ లిస్ట్ లోకి ఇన్ని సినిమాలా..!

జనవరి నుంచే టాలీవుడ్ బాక్సాఫీస్ వరుస సినిమాలు పలకరించాయి. అందులో కొన్ని హిట్టైయి నిర్మాతలకు లాబాలను తీసుకొస్తే.. మరికొన్ని ఎపుడు విడుదలై పత్తా లేకుండా పోయాయి. మొత్తంగా నాలుగు నెలల కాలంలో టాలీవుడ్‌‌లో హిట్స్ కన్నా డిజాస్టర్స్ ఎక్కువ వున్నాయి
2022 జనవరి 1న  ‘ఇందువదన’ చిత్రం రిలీజైన సంగతి కూడా చాలా మందికి తెలియదు... బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది
జనవరి 7న విడుదలైన 1945 సినిమాను సినిమాను చూసిన ప్రేక్షకులు.. క్లైమాక్స్ లేని సినిమా ఏంటంటూ థియేటర్స్ నుంచి బయటికి వస్తూ ఆడియన్స్ తిట్టుకున్నారు.
సూపర్ మచ్చి సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై సోదిలో లేకుండా పోయింది. పైగా మెగా హీరోలెవరు ఈ సినిమాను కనీసం ప్రమోట్ కూడా చేయలేదు.
మహానటి కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ మూవీ జనవరి 28న విడుదలైంది. ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది
ఖిలాడి, ఫిబ్రవరి 11న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ ఊహించినంతగా రాలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది
మళ్లీ మొదలైంది: సుమంత్ హీరోగా విడాకుల తర్వాత జీవితం అనే కాన్సెప్టుతో వచ్చిన సినిమా మళ్లీ మొదలైంది. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 11న నేరుగా జీ5లో విడుదలైంది.
ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చ్ 4న విడుదలైంది. బయ్యర్స్‌కు రూ. 8 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి మార్చి నెలలో తొలి ఫ్లాప్‌గా నిలిచింది.
రాధే శ్యామ్ మార్చ్ 11న విడుదలైంది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 120 కోట్లు నస్టాలతో మన దేశంలోనే 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
న్ ఆఫ్ ఇండియా. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలిరోజే డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్స్ అస్సలు రాలేదు.
స్టాండప్ రాహుల్.. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా సోదిలో లేకుండా పోయింది. ఈ సినిమా విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియదు.
ఏప్రిల్ 8న వరుణ్ తేజ్ ‘గని’తో మూవీ విడుదలైంది. రూ. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. మొత్తంగా రూ. 5 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్యలో నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది..