Tap to Read ➤

ఆచార్య మూవీ రివ్యూ..కామన్ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో సినిమా ఫెయిల్

మెగా ఇమేజ్ కు కొరటాల శివ కథ, దర్శకత్వం తోడైతే... భారీ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. భారీ బ్లాక్ బస్టర్ కాదు... కనీసం కామన్ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్‌ లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన ఆచార్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
అపజయం అంటూ ఎరగని కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కథ, కథనం రొటీన్ గా ఉన్నాయి. తెరపై జరిగే సన్నివేశాలతో ఆడియన్స్ ఎక్కడా ఎమోషనల్ గా కనెక్ట్ కావడం కష్టం.
మెగా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఫస్టాఫ్ నిదానంగా సాగడం ఓ మైనస్ అనిచెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఎమోషన్స్, చిరు, చెర్రీ ఎమోషన్స్ పాజిటివ్‌గా అనిపిస్తాయి.
కొరటాల శివ నుంచి ఇంత వీక్ స్క్రిప్ట్, వీక్ క్యారెక్టరైజేషన్, వీక్ సీన్స్ కామన్ ఆడియన్ కూడా ఆశించి ఉండరు.
చిరంజీవి, రామ్ చరణ్ మీద తెరకెక్కించిన 'బంజారా బంజారా...' సాంగ్ ఆడియో పరంగా అంత హిట్ కాలేదు. కానీ, స్క్రీన్ మీద చూసినప్పుడు బావుంది.
పాటల విషయంలో ప్రేక్షకులను సంతృప్తి పరిచిన మణిశర్మ నేపథ్య సంగీతం విషయంలో నిరాశ పరిచారు.
'ఆచార్య' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను డిజప్పాయింట్ చేస్తుంది