Tap to Read ➤

సోషల్ మీడియాను ఊపేస్తున్న రణబీర్, అలియా పెళ్లి ఫొటోలు

బాలీవుడ్ ప్రేమ జంట అలియా భట్, రణబీర్ కపూర్ ఒక ఇంటివారయ్యారు. వీరి వివాహం ముంబైలో వేడుకగా జరిగింది.
బాలీవుడ్‌ లవ్ బర్డ్స్ ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ నిన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
రణబీర్ కపూర్ నివాసంలో జరిగిన ఈ పెళ్లికి వధూవరుల కుటుంబసభ్యులతో పాటు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
వివాహం సందర్భంగా అలియా ఇన్స్టాలో స్పందిస్తూ... తమకు ఎంతో ఇష్టమైన ప్రదేశంలో ఇద్దరం ఒక్కటయ్యామని చెప్పింది.
అలియా భట్ ఫిల్మోగ్రఫీ
ఐదేళ్లుగా తాము కబుర్లు చెప్పుకున్న బాల్కనీ సాక్షిగా పెళ్లి చేసుకున్నామని అలియా తెలిపింది.
అలియా భట్ స్టన్నింగ్ ఫొటోస్
ఐతే పెళ్లి అయ్యేంతవరకు సీక్రెట్ గానే ఈ వ్యవహారాన్ని నడిపించారు.
వివాహం అయ్యాక వీరే స్వయంగా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి