Tap to Read ➤

ఆగస్ట్ రెండొవ వారం థియేటర్లు,ఓటీటీల్లో వస్తోన్నసినిమాలు,వెబ్ సిరీస్ లు

ఆగస్టు 8 నుంచి 14 వరకూ థియేటర్లు, ఓటీటీలో విడుదల అవుతున్న తెలుగు సినిమాలు
Ram reddy
నితిన్ మాస్ 'మాచర్ల నియోజకవర్గం' ఆగష్టు 12న థియేటర్లలో విడుదల కానుంది.
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'కార్తికేయ 2' ఆగస్టు 13న థియేటర్లలో విడుదల కానుంది.
బాలీవుడ్ ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' ఆగష్టు 11న థియేటర్లలోకి వస్తోంది.
ఆర్యన్ రాజేష్, సదా, మై విలేజ్ షో అనిల్, నిఖిల్ విజయేంద్ర సింహా, నిత్యా శెట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన హలో వరల్డ్ ఆగస్టు 12న 'జీ 5' ఓటీటీలో విడుదల కానుంది.
అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వయంగా నిర్మించిన సినిమా 'కడవర్' తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది
లావణ్యా త్రిపాఠీ, వెన్నెల కిశోర్, సత్య, నరేష్ అగస్త్య, 'గెటప్' శ్రీను తదితరులు నటించిన 'హ్యాపీ బర్త్ డే' సినిమా సోమవారం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల అయ్యింది.
రామ్, కృతి శెట్టి జంటగా నటించిన 'ది వారియర్' సినిమా డిజిటల్ రిలీజ్ కూడా ఈ వారమే. ఆగస్టు 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుంది.
అక్కినేని నాగ చైతన్య 'థాంక్యూ' మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఆగష్టు 12న స్ట్రీమింగ్ కానుంది
సాయి పల్లవి 'గార్గి' సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఆగష్టు 12న స్ట్రీమింగ్ కానుంది