Tap to Read ➤

విజయ్ దేవరకొండ వదులుకున్న బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు

విజయ్ దేవరకొండ తన సినీ కెరీర్‌లో రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటీ.. అందులో ఎన్ని బ్లాక్ బస్టర్సో చూద్దాం..
Ram reddy
డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ సినిమాను విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడు.
భీష్మ సినిమాను ముందు విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఎందుకో ఈ సినిమా కథ విజయ్ కి పెద్దగా నచ్చలేదు.
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ఈ సినిమా హిందీలో రీమేక్ చేయాలని సందీప్ రెడ్డి వంగా భావించాడు. విజయ్ రీమేక్ లో నటించలేనని చెప్పాడు.
ఇస్మార్ట్ శంకర్ కథ ముందు విజయ్ దేవరకొండకు చెప్పాడు పూరి జగన్నాథ్. కానీ ఈ డబుల్ దిమాక్ కథ మన రౌడీ బాయ్ కి అస్సలు నచ్చలేదు.
ఆర్ఎక్స్ 100 సినిమాను కార్తికేయతో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అజయ్ భూపతి. విజయ్ మాత్రం అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ లోనే ఈ కథ కూడా ఉందంటూ రిజెక్ట్ చేసాడు.
ఉప్పెన సినిమా కథ కూడా ముందు విజయ్ దేవరకొండకే చెప్పాడు దర్శకుడు బుచ్చిబాబు . ఇమేజ్ వచ్చేసరికి ఈ కథలో ఆయన్ని ఊహించుకోలేకపోయాడు బుచ్చిబాబు. విజయ్ ఉప్పెన కథను కాదన్నాడు.
విజయ్ దేవరకొండ ఇంత చిన్న కెరీర్‌లోనే ఈయన 10 సినిమాల వరకు నో చెప్పాడు. అందులో కొన్ని సినిమాలు కథలు నచ్చక.. మరికొన్ని సినిమాలు డేట్స్ కుదరక..