Tap to Read ➤

సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్‌గా నిలవాలంటే..ఎంత వసూలు చేయాలో తెలుసా!

మహేష్ బాబును సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది.
అత్యధికంగా నైజాంలో సర్కారు వారి పాట థియెట్రికల్ బిజినెస్ రూ.36 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది.
సీడెడ్‌లో రూ.13.5 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13 కోట్లు, ఈస్ట్-వెస్ట్ రూ.15.5 కోట్లు,
గుంటూరు రూ.9 కోట్లు, కృష్ణా రూ.7.5 కోట్లు, నెల్లూరు రూ.4 కోట్లు వరకు బిజినెస్ చేసినట్లు టాక్.
రెస్టాఫ్ ఇండియాలో రూ.23.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.11 కోట్లు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.100 కోట్లు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియెట్రికల్ బిజినెస్ రూ.125 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది.
సినిమా హిట్టు కొట్టాలంటే దాదాపు రూ.130 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది.
బ్లాక్ బస్టర్‌గా నిలవాలంటే రూ.180 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది.