Tap to Read ➤

రామారావు ఆన్ డ్యూటీ.. ఈ సినిమాను చూడాలనిపించే ఆసక్తికరమైన అంశాలు

మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ జూలై 28 విడుదల కానుంది. ఇక సినిమాను ఎందుకు చూడాలి అనే సందేహంలో కొన్ని అంశాలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నా
Prashanth M
మంచి మాస్ మసాలా సినిమా చూసి చాలా రోజులైంది. కాబట్టి రామారావు మాస్ ఆడియెన్స్ కు మంచి ఎంటర్‌టైనర్‌గా పూర్తిగా అలరిస్తుందని చెబుతున్నారు.
రామారావు ఆన్ డ్యూటీ రొటీన్ మాస్ మసాలా కాదు. ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ ట్విస్ట్ కూడా ఉంది. రవితేజ ఇలాంటి సినిమా చేయడం ఇదే మొదటిసారి.
ఇక సినిమా రన్‌టైమ్ 2 గంటల 26 నిమిషాలు అని చెప్పారు. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను ఆస్వాదించడానికి ఇది సరైన రన్‌టైమ్ అని చెప్పవచ్చు.
రామారావు ఆన్ డ్యూటీలో యాక్షన్ డోస్ కూడా ఉంది. ఐదుగురు విభిన్నమైన యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు ఈ సినిమాకి వర్క్ చేశారు.
ఇక సినిమా మేకింగ్ మొత్తం వింటేజ్ లుక్ 30 ఏళ్ల క్రితం వాతావరణంలో ఉంటుందట. అప్పటి మనుషులు నేరాలు చట్టాలు కూడా సినిమాలో హైలెట్ కానున్నాయి.
ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద 18 కోట్ల టార్గెట్ తో రాబోతోంది. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.
సాధారణంగా రవితేజ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటే తప్ప తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడడు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా సినిమాను ప్రమోట్ చేస్తూ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు.