Tap to Read ➤

గాలివాన వెబ్ సిరీస్ రివ్యూ.. ట్విస్ట్ ను మాత్రం ఎవరూ ఊహించలేరు..!

సీనియర్‌ నటుడు సాయి కుమార్‌, రాధిక శరత్‌ కుమార్‌లు ప్రధాన పాత్రలలో నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ గాలివాన. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్‌ అయ్యింది
ప్రఖ్యాత బీబీసి ఛానల్ కు చెందిన ఓ డాక్యుమెంటరీకి చిత్రరూపంగా తెరకెక్కిన.. ఒక షాకింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చే ఫ్యామిలీ థ్రిల్లర్ గాలివాన.
కథలోని ముఖ్యమైన ట్విస్ట్ ను మాత్రం ఎవరూ ఊహించలేరు. ఆ ట్విస్ట్ యొక్క టెంపోను ను మైంటైన్ ఒక చక్కని థ్రిల్లర్ గా 7 ఎపిసోడ్ల సిరీస్ ను క్యారీ చేసిన విధానం చూడాల్సిందే
చిన్నప్పట్నుంచే ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు అజయ్-గీత
హనీమూన్ కోసం వైజాగ్ వెళ్ళిన ఈ నవ జంటను ఓ దొంగ కిరాతకంగా హత్య చేసి అక్కడి నగాలతో పారిపోతాడు.
అదే దొంగ అజయ్-గీత కుటుంబాల వద్దకు అనుకోని విధంగా ఓ యాక్సిడెంట్ కారణంగా చేరుకుంటాడు.
కొన ప్రాణాలతో ఉన్న అతడ్ని కాపాడి పోలీసులకు అప్పజెబుదాం అనుకున్నప్పటికీ.. రెండు కుటుంబాల్లోని ఒకరు అతడ్ని చంపేస్తారు.
అసలు అజయ్-గీతలను హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ దొంగ ఈ కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతానికే ఎందుకు వచ్చాడు?
ఈ కేస్ ను పోలీస్ ఇన్స్పెక్టర్ నందిని (నందిని రాయ్) ఎలా డీల్ చేసింది? అనేది “గాలివాన” కథాంశం.