Tap to Read ➤

HIT2: అడివి శేష్ మూవీకి రికార్డు బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే హిట్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రమే ‘హిట్: ద సెకెండ్ కేస్’. డిసెంబర్ 2న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలు మీకోసం!
Manoj Kumar
అడివి శేష్ నటించిన తాజా చిత్రమే ‘హిట్ 2’. ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు
హీరో నాని నిర్మించిన హిట్ 2 సినిమాకు నైజాం ఏరియాలో రూ. 4.00 కోట్లు బిజినెస్ అయింది
అడివి శేష్ నటించిన హిట్ 2 మూవీ సీడెడ్‌లో రూ. 1.75 కోట్లు మేర వ్యాపారాన్ని చేసుకుంది
హిట్ 2 చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్‌ను చేసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హిట్ 2 మూవీకి మొత్తంగా రూ. 10.25 కోట్లు మేర బిజినెస్ జరిగింది
ఈ మూవీ కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు పలికింది
అడివి శేష్ హిట్ 2 మూవీ రూ. 14.25 కోట్ల బిజినెస్‌ చేసి.. రూ. 15 కోట్ల టార్గెట్‌తో రాబోతుంది
శేష్ కెరీర్‌లో ఇదే రికార్డు బిజినెస్.. గతంలో మేజర్ సినిమా రూ. 13 కోట్లే అత్యధికంగా ఉంది