Tap to Read ➤

‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర విషయాలు..!

ది లెజెండ్’ అనే చిత్రంతో 51 ఏళ్ళ వయసులో హీరోగా పరిచయమవుతున్నాడు లెజెండ్‌ శరవణన్‌. ఇంత భారీ క్యాస్ట్ అండ్ క్రూ ఎలా పనిచేసారు అనే డౌట్ జనాల్లో ఉంది. అసలు ఈ హీరో ఎవరు అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి.
Ram reddy
తమిళనాడులో శరవణ స్టోర్స్.. అంటే తెలియని వారంటూ ఉండరు. టెక్స్ట్ టైల్స్ , జ్యువెలరీ స్టోర్స్ తో పాటు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నగలు వంటివి అన్నీ ఈ శరవణ స్టోర్స్ లో లభిస్తాయి.
శరవణ స్టోర్స్ స్థాపించిన వారిలో ఒకరైన శరవణన్ సెల్వ రత్నమ్ కొడుకే ఈ ఆరుళ్ శరవణన్.
1970వ సంవత్సరంలో చెన్నైలో అరుళ్ శరవణన్ జన్మించారు.చదువు పూర్తయిన వెంటనే తన తండ్రిలానే శరవణన్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.
మొదట్లో ఈయన టెక్స్ట్ టైల్స్, ఫర్నిచర్, జ్యువెలరీ వంటి వ్యాపారాలను చూసుకున్నారు. వందల కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపారాలు ఇవి.
అరుళ్ కేవలం బిజినెస్మెన్ మాత్రమే కాదు, మోడల్ కూడా. తన ‘శరవణ స్టోర్స్’ కు తనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
తమన్నా, హన్సిక వంటి స్టార్ హీరోయిన్లతో 2019లో శరవణ్ రూపొందించిన ప్రచార చిత్రాలు ఓ రేంజ్లో హాట్ టాపిక్ అయ్యాయి.
చిన్నప్పటి నుండి ఇతనికి నటుడవ్వాలి అనే కోరిక కూడా ఉంది. కానీ అందుకు చాలా కారణాలు అడ్డుపడ్డాయి. మోడల్ గా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడంతో నటుడిగా కూడా మారాలని డెసైట్ అయ్యాడు అరుళ్.
మొదట చెన్నైలో ఉన్న ‘అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో’ యాక్టింగ్ కోర్సు చేశాడు. ఆ తర్వాత ‘ది లెజెండ్ శరవణ స్టోర్స్ కంపెనీ’ బ్యానర్ పై ‘ది లెజెండ్’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
2017 జూన్ లో సోదరి వివాహం సందర్భంగా రూ.15 కోట్ల విలువైన దుస్తులు అరుళ్ బహూకరించాడు. ఈ న్యూస్ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యింది.