Tap to Read ➤

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎంటో తెలుసుకుందామా..
నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన 'అంటే సుందరానికీ' జూన్ 10న సినిమా విడుదలవుతోంది.
'అతడే శ్రీరామన్నారాయణ' ఫేమ్ రక్షిత్ శెట్టి నటించిన తాజా సినిమా '777 చార్లీ'. ఇదీ జూన్ 10న విడుదలవుతోంది.
డియర్ ఫ్రెండ్'. భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న 'హృదయం' సినిమాలో దర్శన పాత్రలో నటించిన దర్శనా రాజేంద్రన్ హీరోయిన్. ఈ సినిమా కూడా జూన్ 10న విడుదలవుతోంది.
1. సురాపానం 2. జరిగిన కథ 3. కిరోసిన్ ..ఈ మూడు చిన్న సినిమాలు ఈ వారంలో రిలీజ్ అవుతున్నాయి
కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా నాగశౌర్య 'అశ్వథ్థామ‌' ఫేమ్ రమణ తేజ దర్శకత్వం వహించిన 'కిన్నెరసాని' సినిమా జూన్ 10న డైరెక్టుగా జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన సినిమా 'సిబిఐ 5: ది బ్రెయిన్ మలయాళం సహా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో జూన్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
శివ కార్తికేయన్ 'డాన్' సినిమా జూన్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. మలయాళ థ్రిల్లర్ సినిమా 'ఇన్నలే వరే' జూన్ 9న సోనీ లివ్ ఓటీటీలో విడుదల అవుతోంది.