Tap to Read ➤

బింబిసార టోటల్ కలెక్షన్లు చూస్తే షాకే.. అన్ని కోట్ల లాభాలతో రికార్డు

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రమే ‘బింబిసార’. టైం ట్రావెల్ కాన్సెప్టుతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ టోటల్‌గా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!
Manoj Kumar
కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన టైం ట్రావెల్ మూవీనే ‘బింబిసార’
బింబిసార సినిమా ఎన్నో అంచనాలతో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది
బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్‌‌ను చేసుకుంది
తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో బింబిసార మూవీ రూ. 33.16 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది
ఈ మూవీకి రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.36 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు వచ్చాయి
బింబిసార మూవీ ముగింపు సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.92 కోట్లు రాబట్టింది
కల్యాణ్ రామ్ బింబిసార మూవీ ఏకంగా రూ. 21.72 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది
బింబిసార మూవీ కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా సరికొత్త రికార్డును సాధించింది