Tap to Read ➤

విక్రమ్ విజయోత్సవంలో కమల్ హాసన్ ఖరీదైన బహుమతులు

విశ్వనటుడు కమల్ హాసన్ చాలా కాలం తరువాత సక్సెస్ అందుకోవడంతో ఆయన ఆనందంలో మునిగిపోయారు. ఇక సినిమా కోసం కష్టపడిన వారికి ఖరీదైన కానుకలు ఇచ్చారు.
విక్రమ్ సినిమాకు పనిచేసిన అందరికీ నిర్మాత కమల్ నుండి బహుమతులు అందాయి.
ముందుగా దర్శకుడు లోకేష్ కి కమల్ హాసన్ లెక్సస్ బ్రాండ్ న్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.
విక్రమ్ సినిమాకు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ పదమూడు మందికి బైకులు అందించారు.
ఇక క్లైమాక్స్ లో రోలెక్స్ అంటూ గూస్ బంప్స్ తెప్పించిన సూర్యను అభినందించారు.
సీక్వెల్ కి ఎలివేషన్ ఇచ్చిన సూర్య కి తన కాస్ట్లీ రోలెక్స్ వాచ్ ను గిఫ్టుగా ఇచ్చారు.
అలాగే మిగతా టీంకి కూడా కమల్ నుండి బహుమతులు అందాయట.
విక్రమ్ సినిమాతో హీరోగా నిర్మాతగా కమల్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.