Tap to Read ➤

KRK movie review..కన్మణి రాంబో కతీజా రివ్యూ

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత, లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్‌'. రొమాంటిక్‌, కామెడీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ
(ఏప్రిల్‌ 28) సమంత పుట్టినరోజు సందర్భంగా తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ
కన్మణి రాంబో ఖతీజా చిత్రం నేడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది
రాంబో కుటుంబంలో ఎవరైనా పెళ్లి చేసుకొంటే జంటలో ఎవరో ఒకరు మరణిస్తారనే ఓ శాపం అనే అంశంతో కథ ఎమోషనల్‌గా మారుతుంది.
రాంబోను వెంటాడే దురదృష్ణ పరిస్థితులు విజయ్ సేతుపతి పాత్రపై సింపథీ కలిగించేలా ఉంటాయి.
కథలో బలమైన పాయింట్, మంచి కథనం లేకపోవడంతో సినిమా పేలవంగా సాగుతుంటుంది.
కతీజా (సమంత) రాంబో ప్రేమ కథలో ఫీల్ లేకపోవడం, కన్మణి, రాంబో అఫైర్‌లో ఎమోషనల్‌ పాయింట్ లేకపోవడంతో సినిమా సాదాసీదాగా మారుతుంది.
క్లైమాక్స్‌లో చెప్పిన పాయింట్ ఆకట్టుకోలేకపోవడంతో సినిమా పేలవంగా కనిపిస్తుంది.
దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకొన్న పాయింట్.. దాని చుట్టు అల్లుకొన్న పాయింట్ బాగానే ఉన్నప్పటికి.. ఆకట్టుకొనే కథనంతో కథను నడిపించలేకపోవడం భారీ మైనస్‌గా మారింది.