Tap to Read ➤

మే నెలలో విడుదలైన మహేష్ బాబు సినిమాలు.. ఫ్లాప్స్ ఎన్నంటే..!

మే నెల బ్యాడ్ సెంటిమెంట్. మహేష్ బాబు కెరీర్లో మే అంతగా కలిసి రాలేదు. ఆ నెలలో వచ్చిన కొన్ని సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి.
2003 మే 23న విడుదలైన నిజం సినిమా విడుదలైంది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. కానీ సినిమా ఫలితం మాత్రం ఫ్లాప్.
2004 మే 14న విడుదలైన నాని కూడా ఫ్లాప్ అయ్యింది. ఖుషి లాంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు ఎస్ జై సూర్య తెలుగులో తెరకెక్కించిన రెండో సినిమా ఇది.
2016 మే 20న విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఎంత దారుణంగా నిరాశపరిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2019 మే 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సూపర్ స్టార్ 25 సినిమాగా వచ్చిన మహర్షి రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది.
మొత్తంగా మే నెలలో మహర్షితో కలిపి నాలుగు సినిమాలు విడుదలైతే.. అందులో 3 ఫ్లాప్స్.. 1 హిట్ మాత్రమే ఉన్నాయి.
సర్కారు వారి పాట సినిమాకు పరుశురామ్  దర్శకత్వం వహించారు. హీరోగా మహేష్ బాబుకు 27వ సినిమా.
సర్కారు వారి పాట సినిమా హిట్ జాబితాలో చేరుతుందా లేకపోతే.. ఫ్లాప్ జాబితాలో చేరుతుందా అనేది చూడాలి