Tap to Read ➤

2022 మే నెలలో విడుదల కానున్న మోస్ట్ అవేటేడ్ మూవీస్ లిస్ట్

2022 మే నెలలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, ‘F3’, సుమ జయమ్మ పంచాయితీతో పాటు శ్రీ విష్ణు భళాతందనాన’ తో పాటు అశోకవనంలో అర్జున కళ్యాణం, శేఖర్, గాడ్సే, కృష్ణ వ్రిందా విహారి సినిమాలు థియేటర్స్‌లో పలకరించనున్నాయి. ప్రేక్షకులను పలకరించనున్నాయి.
జయమ్మ పంచాయితీ ఈ సినిమాను కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కలివరుపు డైరెక్ట్ చేసారు. ఈ సినిమా ఈ నెల మే 8న విడుదల అవుతోంది.
శ్రీ విష్ణు హీరోగా నటించి సినిమా ‘భళా తందనాన’ఈ సినిమా ఈ నెల 8న థియేటర్స్‌లో విడుదల కానుంది.
విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ఈ సినిమా మే 6న విడుదల చేస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
నాగ శౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’ మే 20న విడుదల చేస్తున్నారు.
సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్సే’. ఈ సినిమాను గోపీ గణేష్ పట్టాభి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను మే 20న విడుదల చేస్తున్నారు.
యాంగ్రీ మెన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘శేఖర్’ మే 20న విడుదల చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘F3’. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మే 27న విడుదల కానుంది.