Tap to Read ➤

చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్..ఎక్కువ హిట్స్ సాధించిన హీరోగా..!

చిరంజీవి కెరీర్‌లో 8 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ సాధించాయి. చిరు తరంలో ఇన్ని ఇండస్ట్రీ హిట్స్ సాధించిన హీరో మరెవరు లేరు. ఒక రకంగా తన తరంలో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ సాధించిన హీరోగా చిరు రికార్డులకు ఎక్కారు.
బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇంద్ర’ సినిమా రూ. 29 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది
రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఘరానా మొగుడు’ సినిమా రూ. 10 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ రూ. 7 కోట్ల షేర్ వసూళు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన జగదేవకవీరుడు అతిలోకసుందరి’ రూ. 6 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘యుముడికి మొడుగు’ సినిమా రూ. 5 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
‘అత్తకు యుముడు అమ్మాయికి మొగుడు’ సినిమా రూ. 5.25 షేర్ వసూళ్లను సాధించిన ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
‘పసివాడి ప్రాణం’ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 4.75 కోట్ల వసూళ్లను సాధించింది.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ’ 3.75 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసింది.