Tap to Read ➤

వాల్తేరు వీరయ్య పెను సంచలనం.. చరిత్ర సృష్టించబోతున్న చిరంజీవి

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే ‘వాల్తేరు వీరయ్య’. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సరికొత్త రికార్డును నమోదు చేసేందుకు చేరువైంది. ఆ వివరాలు మీకోసం!
Pichuka Manoj Kumar
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి భారీ స్పందన దక్కి కలెక్షన్లు పోటెతుతున్నాయి
ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుని సత్తా చాటుకుంది
చిరంజీవి 3 సినిమాలు ఓవర్సీస్‌లో 2 మిలియన్ మార్కును చేరగా.. సైరా 2.60 మిలియన్లతో టాప్‌లో ఉంది
చిరు ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ 2.44 మిలియన్ డాలర్లను రాబట్టి ఈ లిస్టులో రెండో స్థానంలో కొనసాగుతోంది
చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ ఓవర్సీస్‌లో 1.28 మిలియన్ డాలర్లు రాబట్టి 4వ స్థానంలో నిలిచింది
చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ‘ఆచార్య’ 985K డాలర్లను వసూలు చేసి ఈ లిస్టులో 5వ స్థానంలో ఉంది
చిరు నటించిన స్టాలిన్ 40K డాలర్లు, ఠాగూర్ 36K డాలర్లు, శంకర్ దాదా జిందాబాద్ 27K డాలర్లు రాబట్టాయి
‘వాల్తేరు వీరయ్య’ చిరంజీవి కెరీర్‌లోనే యూఎస్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచే ఛాన్స్ ఉంది