Tap to Read ➤

ది ఘోస్ట్ మూవీ సెన్సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్.. టాక్ ఎలా ఉందంటే..!

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ మూవీతో అక్కినేని నాగార్జు ఆడియన్స్ ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఇక టాక్ ఎలా ఉందంటే..
Ram reddy
ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ వేగం అనే పల్లవితో సాగె సాంగ్, తమహాగనే థీమ్ సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ లతో అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీకి యు/ఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బోర్డు వారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు కర్నూలులో జరిగింది. ఈ వేడుకకు నాగ చైతన్య, అఖిల్ ముఖ్య అతిథులుగా వచ్చారు
ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్‌లో యాక్షన్, డ్రామా రెండింటినీ బ్యాలెన్స్ చేశాడని నాగార్జున అన్నారు.
‘ది ఘోస్ట్’ చిత్రంలో నాగార్జున ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్‌గా నిలవనున్నాయి. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్‌గా కనిపించనున్నారు.
యువ సంగీత దర్శకులు భరత్ - సౌరభ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకు వెళ్ళింది.
శతృవులను ఘోస్ట్ రూపంలో అంతమొందించే పాత్రలో నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నారు.