Tap to Read ➤

బాలయ్య రాబోయే 5 ప్రాజెక్టుల వివరాలు లీక్.. చిరు డైరెక్టర్‌తో క్రేజీగా!

నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్‌లో ఉన్నారు. దీంతో ఆయన వరుసగా ఐదు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం!
Pichuka Manoj Kumar
బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ మూవీతో నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు
నటసింహా నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు
బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమా భారీ స్పందన అందుకుని వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది
ప్రస్తుతం నటసింహా నందమూరి బాలకృష్ణ తన 108వ ప్రాజెక్టును అనిల్ రావిపూడితో చేస్తున్నారు
బాలయ్య తన 109వ ప్రాజెక్టును 14 రీల్స్ బ్యానర్‌పై బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు తెలిసింది
బాలకృష్ణ తన 110వ మూవీని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై ప్రశాంత్ వర్మతో చేస్తున్నట్లు సమాచారం
నటసింహా బాలయ్య తన 111వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మల్లిడి వశిష్టతో చేయబోతున్నారు
నందమూరి బాలకృష్ణ 112వ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బాబీతో చేస్తున్నారు